Delhi Liquor Scam : ఫోన్ల మార్పుపై సమాధానం లేదు : ఈడీ

Delhi Liquor Scam : ఫోన్ల మార్పుపై సమాధానం లేదు : ఈడీ
సిసోడియాను మళ్లీ విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు ఈడీ తెలిపింది

లిక్కర్ స్కాంలో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఈడీ ప్రశ్నించింది. ఇన్ని ఫోన్లు ఎందుకు మార్చారనే ప్రశ్నకు సిసోడియా ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శుక్రవారం కోర్టుకు తెలిపింది. ఈడీ కస్టడీలో ఉన్న సిసోడియా నలుగురు అధికారులనుఎదుర్కొన్నారు.


ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా ప్రశ్నిస్తున్న అధికారులకు మనిష్ సిసోడియా సమాదానాలు ఇవ్వలేదని కోర్టుకు తెలిపింది. సిసోడియా కీలక పాత్ర పోషించారని ఈడీ గతంలో పేర్కొంది. సిసోడియా చాలా ఫోన్‌ లను మార్చుకున్నాడని, ఈ ఫోన్‌లు అతని పేరుతో కొనుగోలు చేయలేదని ఏజెన్సీ తెలిపింది. 7 రోజుల ED గడువు ముగియడంతో సిసోడియాను రూస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీలాండరింగ్ కేసులో సిసోడియా ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.

సిసోడియాను మళ్లీ విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు ఈడీ తెలిపింది. తన ఫోన్ ఎక్కడ ఉందో చెప్పలేకపోయాడని... సీబీఐ కూడా తమ రిమాండ్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించిందని తెలిపింది. ఈ నేపథ్యంలో రిమాండ్ పొడిగించాలన్న విజ్ఞప్తిని సిసోడియా తరపు న్యాయవాది వ్యతిరేకించారు. సిసోడియా కంప్యూటర్‌ను గతంలో ఒక ఏజెన్సీ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేసిందని చెప్పారు. ఇప్పుడు మరో ఏజెన్సీ మొత్తం ప్రక్రియను మళ్లీ పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story