Delhi Liquor Scam : మనీష్ సిసోడియాకు కస్టడీ పొడగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాను విచారించేందుకు మరో ఐదు రోజుల గడువును పెంచింది కోర్టు. ఈ విషయంపై సిసోడియా అసహనం వ్యక్తం చేశారు. తనను ప్రతీ రోజు 30 నిమిషాల నుంచి 1 గంట మాత్రమే ఈడీ ప్రశ్నిస్తోందని అన్నారు. ఇన్ని రోజులు ప్రశ్నించకుండా అధికారులు ఏం చేశారని ప్రశ్నించారు.
తొమ్మిది నెలల్లో రద్దు చేసిన కొత్త మద్యం పాలసీతో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై మనీష్ సిసోడియా ను సీబీఐ అరెస్టు చేసింది. ఫిబ్రవరి 26 నుంచి సిసోడియా జైలులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది.
"ఏడు నెలల పాటు కేసును విచారించిన తర్వాత, ఈడీ తదుపరి కస్టడీని కోరితే, అప్పటి వరకు వారు ఏమి సంపాదించారో చూపించాలి" అని సిసోడియా తరపు న్యాయవాది కోర్టులో అన్నారు. "నేను కస్టడీ పొడిగింపును వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సీబీఐ దర్యాప్తును నిర్వహిస్తోంది. నేరం యొక్క ఆదాయాలపై మాత్రమే ఈడీ దర్యాప్తు చేయగలదు, నేరంపై కాదు" అని సిసోడియా వాదించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com