Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. అరబిందో ఫార్మా డైరెక్టర్ అరెస్ట్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలుగురాష్ట్రాలకు చెందిన వ్యక్తులు అరెస్ట్ అవుతుండడం సంచలనంగా మారింది. అరబిందో ఫార్మా డైరెక్టర్, జీఎం శరత్ చంద్రారెడ్డితో పాటు వినయ్‌బాబు అరెస్ట్ చేశారు ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణం కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేశారు.
వీరిలో ముగ్గురు నిందితులను ఈడీ అరెస్ట్ చేయగా, ఇద్దరిని సీబీఐ అరెస్ట్ చేసింది. వీళ్లిద్దరినీ రిమాండ్‌కు తరలించారు. సెప్టెంబర్‌లో శరత్‌చంద్రారెడ్డిని ప్రశ్నించారు. లిక్కర్‌స్కామ్‌పై దర్యాప్తు చేస్తున్న ఈడీ, సీబీఐ దూకుడుగానే ముందుకు వెళ్తున్నాయి ఈ కేసులో పక్కా ఆధారాలు సేకరించారు.
ఇప్పటికే లిక్కర్ కేసులో సమీర్ మహేంద్రు, అభిషేక్‌రావు, విజయ్ నాయర్, దినేశ్ అరోరాను అరెస్టు చేశారు.రాబిన్ డిస్టిలరీస్ అభిషేక్‌రావుతో ప్రముఖులకు లింక్‌లు బయటపడడంతో ఇటీవలే వరుసగా ఆడిటర్లు సహా మరికొందరి ఇళ్లలో సోదాలు జరిగాయి.
మరోవైపు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ED, CBI అరెస్టు చేసిన వ్యక్తులలో వినయ్ బాబు, సమీర్ మహేంద్రు, అభిషేక్ బోయిన్‌పిళ్లై, విజయ్ నాయర్, శరత్ రెడ్డి ఉన్నారు. అప్రూవర్‌గా మారిన దినేశ్ అరోరా స్టేట్మెంట్‌తో త్వరలో మరిన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఇవాళ అరెస్టైన శరత్ చంద్రారెడ్డిని సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో ఢిల్లీలో సుదీర్ఘంగా విచారించి ఇప్పుడు అరెస్టు చేశారు. అరబిందో గ్రూపులో శరత్ చంద్రారెడ్డి 12 కంపెనీలకు డైరెక్టరుగా ఉన్నారు. ఇక ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీకి కూడా శరత్ డైరెక్టర్‌గా ఉన్నారు.. ఆ కంపెనీ పేరు ఈ లిక్కర్ స్కామ్ కేసులో A5గా చేర్చారు..ఢిల్లీ లిక్కర్ కేసులో శరత్ చంద్రారెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది సీబిఐ. CBI ఎఫ్‌ఐఆర్‌లో A-8గా శరత్ చంద్రారెడ్డి పేరు ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com