Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. సీబీఐ ఛార్జిషీట్‌లో కీలక అభియోగాలు

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులపై సీబీఐ ఛార్జిషీట్‌లో కీలక అభియోగాలు నమోదు చేశారు. లంచాలు కిక్‌బ్యాక్స్ నగదు రూపంలో హవాలా మార్గంలో తరలించినట్లు పేర్కొన్నారు. అభిషేక్ బోయినపల్లి 20 నుంచి 30 కోట్ల నగదును హవాలా మార్గంలో తరలించాడని ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.
ఈ డబ్బు అంతా 2021 జులై-సెప్టెంబర్ మధ్య అడ్వాన్స్‌గా ముట్టజెప్పినట్లు గుర్తించారు. సీబీఐ కోర్టు న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో కీలక అంశాలు ప్రస్తావించారు. మద్యం పాలసీ రూపకల్పన జరుగుతున్న టైంలోనే కుట్ర జరిగినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. అడ్వాన్స్ కింద ముడుపులు, కిక్‌బ్యాక్స్ కింద అందాయని వెల్లడైంది. మరోవైపు FIRలో పేర్లు పొందుపరచనివారిపైనా దర్యాప్తు కొనసాగుతున్న ఛార్జిషీట్‌లో వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com