Delhi Lockdown : ఢిల్లీలో లాక్ డౌన్ పొడిగింపు..!

Aravind Kejriwal : కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించిన ఢిల్లీ ప్రభుత్వం మరో వారం రోజుల(మే 31వరకు) పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. ఢిల్లీలో కరోనా నియంత్రణలోకి వచ్చినప్పటికీ ముందుజాగ్రత్తగా మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టుగా వెల్లడించారు. ఇలాగే కేసుల్లో తగ్గుదల కనిపిస్తే.. మే 31 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తామని ఆయన అన్నారు. అంతేకాకుండా త్వరలో రెండు కోట్ల మందికి టీకాల కోసం చర్యలు చేపడుతున్నామని అని అన్నారు. అటు ఢిల్లీలో నెల రోజుల్లోనే రోజువారి కేసులో 29 వేల నుంచి రెండు వేలకు వచ్చాయి. గడచిన 24 గంటల్లో కేవలం 16 వందల కేసులు మాత్రమే వచ్చాయి. పాజిటివీటి రేటు 2.5% కన్నా తక్కువగానే ఉంది. కరోనా మహమ్మారిపై ఢిల్లీ ప్రజలు సమైక్యంగా పోరాటం చేశారని కేజ్రివాల్ గుర్తుచేశారు. కాగా ఢిల్లీలో లాక్ డౌన్ పొడిగించడం ఇది ఐదోసారి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com