Delhi Metro : మెట్రోలో చంద్రముఖి.. చిరాకులో ప్రయాణికులు

Delhi Metro : మెట్రోలో చంద్రముఖి.. చిరాకులో ప్రయాణికులు
మెట్రోరైల్లో ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన యువతి; వీడియోల కోసం జనాలను ఇబ్బంది పెడుతున్నారన్న నెటిజన్లు..


సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ చంద్రముఖి. తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అయి హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను హిందీలో రిమేక్ చేశారు. 2007వ సంవత్సరంలో అక్షయ్ కుమార్ హీరోగా 'బూల్ బులయ్యా' పేరుతో విడుదలై హిట్ అయింది. ఈ సినిమాలో చంద్రముఖి పేరు మంజూలిక. తాజాగా మంజూలిక వేషధారణలో ఓ యువతి ఢిల్లీ నోయిడా మెట్రో రైల్లో హల్ చల్ చేసిన వీడియో వైరల్ అయింది.

చింపిరి జుట్టు, పసుపు పచ్చ చీర, నగలు వేసుకుని మంజూలిక వేషంతో మెట్రోలోకి ప్రవేశించింది. రైల్లో కూర్చున్న వారిని భయపెట్టడానికి ప్రయత్నించింది. ఆవిడను పట్టించుకోకుండా ప్రశాంతంగా కూర్చున్న వారి దగ్గరికి వెళ్లి అరుస్తూ పిచ్చి చేష్టలు చేసింది. అయినా కొందరు పట్టించుకోలేదు. ఒక యువకుడు తన హెడ్ ఫోన్స్ పెట్టుకుని చివరి సీట్ లో కూర్చుని ఉండగా, అని భుజం మీద అమాంతం దూకి అతన్ని పక్కకు నెట్టింది.

ఈ ఘటనను ప్రస్తావిస్తూ, కొందరు నెటిజన్లు పోలీసులకు ట్యాగ్ చేస్తున్నారు. చిన్న పిల్లలకు, ప్రశాంతత కోరుకునే వారికి సదరు యువతి చేష్టలు చీరాకు తెప్పించే విధంగా ఉన్నాయని అంటున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం పబ్లిక్ ప్లేస్ లో చిల్లర పనులు చేసే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ పోలీసులు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story