Delhi Mundka fire : ఢిల్లీ అగ్నిప్రమాదం : మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

Delhi Mundka fire : దేశరాజధాని ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని నాలుగు అంతస్తుల వాణిజ్య భవనంలో శుక్రవారం సాయంత్రం భారీ మంటలు చెలరేగడంతో 27 మంది మరణించగా, 12 మంది గాయపడ్డారు.
అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అంతేకాకుండా ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు కూడా ఆదేశించారు.
ఇక ఈ దుర్ఘటనకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. అటు ఈ ఘటన పైన ఇప్పటికే స్పందించిన ప్రధాని మోదీ మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com