కేజ్రీ సర్కార్ సంచలన నిర్ణయం.. మాస్క్ ధరించకపోతే భారీ ఫైన్

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మహమ్మారి రోజు రోజుకూ మరింత ఉద్ధృతమవుతోంది. బుధవారం మరో 7,400కు పైగా పాజిటివ్ కేసులు.. 131 మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని పరిస్థితులపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం సీఎం మాట్లాడుతూ.. రాజధాని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, విందులు, వినోదాలు, వేడుకలు తమ ఇంటి వద్దే నిర్వహించుకోవాలని సూచించారు. వచ్చే ఛట్ పూజను ఇంటి వద్దే ఎటువంటి హడావుడి లేకుండా జరుపుకోవాలని అన్నారు.
పెద్ద సంఖ్యలో జనం గుమికూడితే అందులో ఒక్కరికి కోవిడ్ ఉన్నా అందరికీ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఢిల్లీలో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఏ ఒక్కరైనా మాస్క్ ధరించకపోతే రూ.2,000 జరిమానా విధిస్తామని అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com