దాసరి నారాయణరావుకి, యాంకర్ దేవికి ఉన్న బంధుత్వం..!!

జర్నలిస్ట్ దేవి బిగ్‌బాస్ 4లో ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్.. ఒకరితో చెప్పించుకునే పని లేకుండా తన పనేదో తాను పక్కాగా చేసుకుపోతుంది. ఇచ్చిన టాస్క్‌లకు వీలైనంత వరకు న్యాయం చేస్తుంది. దేవి చాలా తెలివైనదని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు సైతం కితాబిచ్చారు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడంతో కుటుంబ బాధ్యతలను చిన్న వయసులోనే తన భుజాల మీద వేసుకుంది. జర్నలిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న దేవి నాగవల్లి గెలుస్తానన్న గట్టి నమ్మకంతో హౌస్‌లోకి అడుగు పెట్టింది.
ఆమె తల్లి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవి ఎన్ని కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చిందో వివరించారు. జీవితంలో పోరాడి గెలిచిన దేవి బిగ్‌బాస్ హౌస్‌లోనూ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేవి తండ్రి 2000లో చనిపోయారని అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు తనే తీసుకుందని వివరించారు. ఆమె అన్నయ్య, తమ్ముడు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆమె వల్లే అని అన్నారు. రాజమండ్రిలో అంతా కలిసే ఉంటున్నామని అన్నారు.
ఇక దర్శకరత్న దాసరి నారాయణారావు దేవి నాన్న గారికి మేనమామ అవుతారు. అయినా ఎప్పుడూ ఆయన పేరును ఎక్కడా ఉపయోగించలేదు. తన స్వశక్తితోనే పైకి వచ్చిందని అన్నారు. దేవి కాలేజీ చదువుకునే రోజుల్లో క్రికెట్ బాగా ఆడేదని చెప్పారు. ఆమెలోని పట్టుదలే ఆమెను విజేతగా నిలుపుతుంది. ఇక హౌస్‌లో దేవికి గట్టి పోటీ ఇచ్చేది నోయల్ అనుకుంటున్నానని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com