అంతర్జాతీయ విమాన రాకపోకలపై కేంద్రం తాజా మార్గదర్శకాలు

అంతర్జాతీయ విమాన రాకపోకలపై కేంద్రం తాజా మార్గదర్శకాలు
కరోనా స్ట్రెయిన్‌ వైరస్‌ కేసులు బయటపడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు విధించింది.

కరోనా స్ట్రెయిన్‌ వైరస్‌ కేసులు బయటపడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు విధించింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఆంక్షలు ఇటీవల సడలించగా స్ట్రెయిన్‌ కేసులతో తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. అంతర్జాతీయ ప్యాసింజర్‌ విమానాల రాకపోకలపై జనవరి 31 వరకు నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో జూన్‌ 26న విడుదల చేసిన మార్గదర్శకాలను జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది.

అయితే, కార్గో విమానాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ప్రత్యేక పరిస్థితుల్లో ముందస్తు అనుమతితో నిర్దేశిత మార్గాల్లో విమానాలు నడిపేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇక యూకే నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు మరింత కట్టుదిట్టం చేసింది. యూకే నుంచి వచ్చే విమానాలపై మరో వారంరోజలుపాటు పూర్తి నిషేధం విధించనుంది. బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలపై జనవరి ఏడు వరకు నిషేధం కొనసాగనుంది.అంతర్జాతీయ విమాన రాకపోకలపై కేంద్రం తాజా మార్గదర్శకాలు

Tags

Next Story