Karnataka: పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు కావాలి.. అధికారులకు యువకుల విన్నపం..

Karnataka: పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు కావాలి.. అధికారులకు యువకుల విన్నపం..
Karnataka: ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రజలకు సహాయం చేసేవారు అని అర్థం.

Karnataka: ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రజలకు సహాయం చేసేవారు అని అర్థం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారు సాయం చేయడానికి ముందుకొస్తారు. అందుకే ప్రభుత్వం కూడా ప్రజల దర్బార్, ప్రజా వాణి లాంటి కార్యక్రమాలు పెట్టి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అలా అని వారికి ఉండే ప్రతీ సమస్య ప్రభుత్వమే తీర్చగలుగుతుందా..? కర్ణాటక రాష్ట్రంలోని యువ రైతులు ఒక కొత్త సమస్యతో తహసీల్దారు దగ్గరకు వచ్చారు.

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో స్త్రీ, పురుషుల జనాభాలో చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే అక్కడ యువకులకు 30 దాటినా పెళ్లి కావడం లేదు. 40 ఏళ్లు వచ్చినా పెళ్లికాని వారు కూడా ఉన్నారు. ఈరోజుల్లో పెళ్లి అనగానే అమ్మాయి తరపున వారు చాలా విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. కనీసం ఆస్తి, ఉద్యోగం.. లాంటివి ఉంటేనే పెళ్లికి ఒప్పుకుంటున్నారు. అలా కాకుండా వ్యవసాయం చేస్తున్న యువ రైతులను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడటం లేదు.

వెనకబడిన గ్రామాల్లో అమ్మాయిలకు మెజారిటీ ఏజ్ రాగానే పెళ్లి చేసేస్తుంటారు. ఆ కారణంగా అమ్మాయికి, అబ్బాయికి వయసులో చాలా తేడా ఉంటుంది. ఒకవేళ అమ్మాయి పెళ్లి చేసుకున్న భర్త వదిలేసినా, చనిపోయినా.. 25 ఏళ్ల అమ్మాయిని 40 ఏళ్ల అబ్బాయి మొదటి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే కర్ణాటకలోని తుమకూరు జిల్లా యువకులు అధికారులను ఆశ్రయించారు.

తుమకూరు జిల్లాలోని తిమ్మాపుర గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి జన స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు అధికారులు. ఆ కార్యక్రమంలో వ్యవసాయ కుటుంబాలకు చెందని 15 మంది యువకులు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలను చూసిపెట్టాలని వినతిపత్రాలు అందజేసారు. గతంలో జిల్లా అధికారికి కూడా అర్జీలు పెట్టుకున్నా లాభం లేదని వారు అన్నారు. చివరికి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకకపోవడం ఒక ప్రభుత్వ సమస్యగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story