సైకిల్ చోరీ.. స్పందించిన సీఎం!

కేరళలోని ఓ వికలాంగ వ్యక్తి.. తన కొడుకు జస్టిన్ సైకిల్ చోరీ అయిందని, దయచేసి ఎవరైనా దాని ఆచూకి చెప్పండంటూ ఈ నెల 24 న ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టాడు. అయితే దీనికి గాను వీపరితమైన స్పందన వచ్చింది. మూడు రోజుల తరువాత ఒక సరికొత్త సైకిల్ అతని ఇంటికి చేరుకుంది. అయితే అది కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి బహుమతిగా రావడం విశేషం..
రూ.6,000 విలువ చేసే సైకిల్ కొనడానికి తనకి కొన్ని నెలలు పట్టిందని దయచేసి ఎవరికైనా తెలిస్తే చెప్పగలరంటూ పెట్టిన ఆ పోస్ట్ వైరల్ కావడంతో ఏకంగా ముఖ్యమంత్రి పినరాయి విజయన్ స్పందించారు. కొట్టాయం జిల్లా కలెక్టర్ ఎం.అంజనాతో వారికి సైకిల్ ఇప్పించారు. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ జస్టిన్ ఇంటికి వెళ్లి అతనికి సరికొత్త సైకిల్‌ను బహుకరించారు.
అంతేకాకుండా స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తామని వికలాంగుడికి సీఎం హామీ ఇచ్చారు. దీనితో ఆ వికలాంగుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com