అత్యంత విషమంగా దిలీప్ కుమార్ ఆరోగ్యం

అత్యంత విషమంగా దిలీప్ కుమార్ ఆరోగ్యం
X
అత్యంత విషమంగా ఉందని ఆయన భార్య సైరా భాను మీడియాకు వెల్లడించారు.

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ (97) ఆరోగ్యం పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆయన భార్య సైరా భాను మీడియాకు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఇప్పుడు మరింత విషమంగా మారింది. కొన్ని రోజుల క్రిందట ఆయనకు కరోనా సోకింది. అప్పటి నుంచి ఆయన బాడీలో ఇమ్యూనిటీ పవర్ మరింతగా పడిపోయిందని సైరా భాను తెలిపారు. కనీసం ఇంట్లో నాలుగు అడుగులు కూడా వేయలేకపోతున్నారని తెలిపారు. ఇలాంటి సమయంలో ఆయన పక్కనుండడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

54 ఏళ్ల క్రిందట 1966లో ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. దిలీప్ కుమార్ సోదరులు ఇద్దరూ ఈ మధ్యే కరోనాతో చనిపోయారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కూడా అత్యంత విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. బాలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా ఎన్నో వందల సినిమాలు చేసిన దిలీప్ కుమార్.. కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉన్నారు.

Tags

Next Story