మహీంద్రా కార్లపై డిస్కౌంట్.. 15 రోజులే ఈ ఆఫర్

మహీంద్రా కార్లపై డిస్కౌంట్.. 15 రోజులే ఈ ఆఫర్
వివిధ మోడళ్లపై ఏకంగా రూ.3.06 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.

కొత్త ఏడాదిలో కొత్త కారు కొనుక్కోవాలనుకుంటే మహీంద్రా కార్లు ఇచ్చే డిస్కౌంట్ గురించి తెలిస్తే ఇప్పుడే కారు బుక్ చేయడానికి వెళతారేమో. 2020 సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగుస్తుంది. ఈ క్రమంలో వివిధ మోడళ్లపై ఏకంగా రూ.3.06 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. అయితే ఈ రాయితీ డిసెంబర్ నెలాఖరు వరకు మాత్రమే ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన థార్ మినహా మిగిలిన అన్ని మోడళ్లపై మహీంద్రా ఈ రాయితీ అందిస్తుంది. నగదు రాయితీ, ఎక్సేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటి వివిధ రూపాల్లో కస్టమర్లకు ఈ ప్రయోజనాలను అందిస్తోంది.

ఆయా ప్రాంతాలు, నగరాల ఆధారంగా డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ క్రమంలో బీఎస్ 6 వాహనాలపై ఏకంగా రూ.3.06 లక్షల వరకు తగ్గింపుని అందిస్తోంది. మహీంద్రా అల్తూరస్ జీ4పై నగదు రాయితీ గరిష్టంగా రూ. 2.2 లక్షల వరకు ఉంది. రూ.50 వేల వరకు ఎక్సేంజ్ బోనస్‌తో పాటు రూ.16 వేల వరకు యాక్సెసరీస్‌ను అందిస్తోంది. కార్పొరేట్ డిస్కౌంట్ మరో రూ.20 వేల వరకు ఉంది. ఈ కారు ఎక్స్-షోరూం ధర రూ.28.73-31.73 లక్షలు.

ఈ ఆఫర్లతో ఈ కారు కొనుగోలుదారులకు రూ.3.06 లక్షల వరకు ప్రయోజనం చేకూరుతుంది. ఇక ఇతర కార్లపై.. మహీంద్రా ఎక్స్‌యూవీ 500 పై క్యాష్ ఆఫర్ రూ. 12.200, ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.20 వేలు కార్పొరేట్ ఆఫర్ ఉన్నాయి. ఎక్స్‌యూవీ 300 పై రూ.25 వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. మహీంద్రా కేయూవీ 100 ఎన్‌ఎక్స్‌టీపై రూ.62 వేలకు పైన, స్కార్ఫియోపై రూ. 30 వేలకు పైన, స్కార్పియోపై రూ.30,600, బొలెరోపై రూ.20,550 వరకు ప్రయోజనాలందుతాయి.

Tags

Next Story