బ్రౌన్ రైస్ vs వైట్ రైస్.. ఏది మంచిది

బ్రౌన్ రైస్ vs వైట్ రైస్.. ఏది మంచిది
మల్లెపువ్వులాంటి తెల్లటి అన్నం మనసు దోచేస్తుంది.. జిహ్వ చాపల్యాన్ని పెంచేస్తుంది. ఏ కూర వేసుకుతిన్నా రుచిగానూ ఉంటుంది.

తెల్లటి అన్నం తినడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందవు.. బ్రౌన్ రైస్ తిందామంటే ముద్ద దిగదు.. కానీ బ్రౌన్ రైస్ లో ఉన్న ఉపయోగాలు తెలుసుకుంటే కచ్చితంగా తినాలనిపిస్తుంది.

బ్రౌన్ రైస్ ఆరోగ్యకరమైనది.. పోషకాలతో నిండి ఉంటుంది. ఈ బియ్యంలో ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. అలాగే, ఇవి తెలుపు బియ్యం లాగా పాలిష్, ప్రాసెసింగ్‌ వంటివి చేయరు కనుక ఆరోగ్యకరమైనది మరియు పోషక విలువలు అధికంగా కలిగి ఉంటాయి.

బ్రౌన్ రైస్‌ లోని ఆరోగ్య ప్రయోజనాలు..

1. డయాబెటిస్: బ్రౌన్ రైస్‌లో ఫైటిక్ యాసిడ్, ఫైబర్, ఎసెన్షియల్ పాలిఫెనాల్స్ పుష్కలంగా ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి . ఇది సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్, ఇది చక్కెరలను నెమ్మదిగా విడుదల చేయడానికి సహాయపడుతుంది, అందువల్ల మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

2. ఎముకల ధృఢత్వం: బ్రౌన్ రైస్ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇందులో ఉన్న మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

3. హృదయ ఆరోగ్యం: బ్రౌన్ రైస్‌లో సెలీనియం ఉంటుంది. ఇది గుండెకు చాలా మంచిది

4. జీర్ణ ఆరోగ్యం: అధిక ఫైబర్ కంటెంట్ తో ఉన్న బ్రౌన్ రౌస్ ప్రేగు పనితీరును నియంత్రిస్తుంది. జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేస్తుంది.

5. బరువు నిర్వహణ: ఇందులో మాంగనీస్, భాస్వరం ఉన్నాయి, ఇవి శరీరంలో పేరుకున్న కొవ్వులను సంశ్లేషణ చేయడానికి, ఊబకాయాన్ని నియంత్రించడానికి సహాయపడతాయి. దీనిలో ఉన్నఅధిక ఫైబర్ కంటెంట్ త్వరగా ఆకలి అవ్వనివ్వదు. కొంచెం తిన్నా ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు ఉంటుంది. తద్వారా చిరుతిండ్లు తినాలన్న కోరికను నియంత్రిస్తుంది.

6. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది: బ్రౌన్ రైస్‌లో ఉండే ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని అంటారు. బ్రౌన్ రైస్ ఆరోగ్యకరమైన ధాన్యాలలో ఒకటిగా మారుతుంది.

7. శక్తిని పెంచుతుంది: బ్రౌన్ రైస్‌లో మెగ్నీషియం ఉంటుంది, అది మన శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ లను శక్తిగా మారుస్తుంది.

8. కిడ్నీలో రాళ్లు: ఫైబర్ అధికంగా ఉండే బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలు కిడ్నీలో రాళ్ళు వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకునే మహిళలతో పోలిస్తే ఎక్కువ ఫైబర్ తినే మహిళల కిడ్నీలో రాళ్ళు వచ్చే ప్రమాదం 13% తక్కువగా ఉందని తేలింది.

9.బెంగళూరుకు చెందిన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అంజు సూద్ నివేదిక ప్రకారం.. తెలుపు బియ్యంలో చక్కెర కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది సులభంగా కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఆరోగ్యకరమైన తృణధాన్యాలు తీసుకోవడం ద్వారా దీర్ఘకాలికంగా ఆరోగ్యకరమైన జీవనశైలి నిర్వహించడానికి సహాయపడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story