ఓ డాక్టర్ నిర్వాకం.. కొవిడ్ వచ్చిందని నకిలీ రిపోర్ట్ ఇచ్చి..

ఓ డాక్టర్ నిర్వాకం.. కొవిడ్ వచ్చిందని నకిలీ రిపోర్ట్ ఇచ్చి..
వైరస్ వచ్చి ఓ పక్క దేశ ప్రజలంతా నానా తిప్పలు పడుతుంటే వైద్యం పేరుతో సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు కొందరు డాక్టర్లు.

వైరస్ వచ్చి ఓ పక్క దేశ ప్రజలంతా నానా తిప్పలు పడుతుంటే ఇప్పుడు కూడా వైద్యం పేరుతో సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు కొందరు డాక్టర్లు. కోవిడ్ టెస్ట్ చేయించుకోడానికి వచ్చిన ఓ వ్యక్తికి నెగిటివ్ వచ్చినా పాజిటివ్ అని నకిలీ రిపోర్ట్ ఇచ్చి అడ్డంగా బుక్కయ్యాడు. నిందితులు మాల్వియా నగర్ నివాసి కుష్ బిహారీ పరాషర్ మరియు అతని సహచరుడు అమిత్ సింగ్ అని పోలీసులు గుర్తించారు. కోవిడ్ టెస్ట్ చేయించుకున్న ఓ వ్యక్తి తన పేరు రిపోర్టులో తప్పుగా వచ్చిందని డయాగ్నొస్టిక్ కేంద్రాన్ని సంప్రదించాడు. సరిదిద్ది కొత్త రిపోర్ట్ పంపించమని ల్యాబ్ టెక్నీషియన్ ని కోరాడు. దీంతో తమ వద్ద ఉన్న రికార్డులను పరిశీలించిన ల్యాబ్ సిబ్బంది ఆ పేరుతో తమ వద్ద ఎవరూ టెస్ట్ చేయించుకోలేదని చెప్పారు. దాంతో టెస్ట్ చేయించుకున్న సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదంతా డాక్లర్ నిర్వాకమే అని భావించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. డాక్టర్.. తన వద్దకు వచ్చే రోగులను కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తూ ఈ తర్వాత నకిలీ నివేదికలు తయారు చేసి పంపేవారని పోలీసులు తెలిపారు. ఒక్కో టెస్టుకు రూ.2400 చొప్పున వసూలు చేసేవాడని పేర్కొన్నారు. గత రెండు నెలలుగా ఈ విధమైన మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. సీఆర్ఎల్ డయాగ్సోస్టిక్స్ ల్యాబ్, మోడ్రన్ డయాగ్నోస్టిక్ అండ్ రీసెర్చి సెంటర్, డాక్టర్ పి.భాసిన్ పాథ్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రొగ్నోసిస్ లేబోరేటరీస్ పేరుతో నకిలీ రిపోర్టులు తయారు చేసి ఇప్పటివరకు 75 మందికి పై మోసగించాడని పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story