Uttar Pradesh: ప్రేమగా పెంచుకున్న శునకం.. యజమాని కోసం ప్రాణాలర్పించింది..

Uttar Pradesh: ప్రేమగా పెంచుకున్న శునకం.. యజమాని కోసం ప్రాణాలర్పించింది..
Uttar Pradesh: యూపీలోని ఝాన్సీలో విషపూరిత పాము నుండి యజమానిని రక్షించిన శునకం ప్రాణం విడిచింది.

Uttar Pradesh: యూపీలోని ఝాన్సీలో విషపూరిత పాము నుండి యజమానిని రక్షించిన శునకం ప్రాణం విడిచింది. శునకం తన యజమానితో కలిసి నడుచుకుంటూ వెళుతుండగా దానికి పాము కనిపించింది. అది ఎక్కడ తన యజమానిని కాటు వేస్తుందో అని భావించింది.


ఒక్క ఉదుటున దాని మీదకు దూకి దానిని చంపేసింది. ఈ క్రమంలో శునకం పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. ఏ బంధమో వారిద్దరిది. అతడి రుణం ఈ విధంగా తీర్చుకుంది అని స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

జిల్లా పంచాయతీ సభ్యుడైన అమిత్ రాయ్ యూపీలోని ఝాన్సీ జిల్లా సరిహద్దుకు ఆనుకుని ఉన్న మధ్యప్రదేశ్‌లోని ప్రతాప్‌పురలో నివసిస్తున్నారు.

అమిత్‌కు పెట్స్ అంటే అమితమైన ప్రేమ. ఐదేళ్ల క్రితం అమెరికాకు చెందిన ఓ డాగ్‌ను తీసుకు వచ్చి దానికి గబ్బర్ అని పేరు పెట్టి ప్రేమగా పెంచుకుంటున్నాడు.

అమిత్ దగ్గర మరికొన్ని డాగ్స్ ఉన్నా గబ్బర్‌ అంటే కొంచెం ఎక్కువ ప్రేమను కనబరిచేవాడు. గబ్బర్ కూడా అమిత్‌ని అంతే ఇదిగా ప్రేమించేది.

తన అనుమతి లేకుండా ఎవరినీ గబ్బర్ దగ్గరకు రానిచ్చేవాడు కాదు అమిత్.

బుధవారం నాడు అమిత్ తన కుక్కతో కలిసి ప్రతాప్ పురాలోని తన ఫామ్‌హౌస్‌కు వాకింగ్‌కు వెళ్లాడు. తన యజమాని వద్దకు వస్తున్న పెద్ద విషసర్పం (రస్సెల్స్ వైపర్)ని గబ్బర్ గుర్తించింది.

తన యజమానికి విధేయుడైన గబ్బర్ వెంటనే అమిత్‌ని రక్షించేందుకు పాముపైకి దూసుకెళ్లింది. సుదీర్ఘంగా సాగిన పాము-కుక్కల పోరులో గబ్బర్ విషపూరిత పామును రెండు ముక్కలుగా చేసి చంపేసింది.

అయితే, పాము విషం గబ్బర్ శరీరంలోకి వ్యాపించడంతో కొన్ని నిమిషాల తర్వాత కింద పడిపోయింది. తన యజమాని కోసం కుక్క తన ప్రాణాలను బలితీసుకుంది. అమిత్, అతని కుటుంబ సభ్యులు ఈ దృశ్యం చూసి చలించిపోయారు. కంటతడి పెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story