బాగు చేయించడానికి డబ్బు లేదు.. : కంగన

బాగు చేయించడానికి డబ్బు లేదు.. : కంగన
అక్కడి నుంచే పనిచేస్తానని ఆమె ట్విట్టర్‌లో పేర్కొంది

అక్రమ నిర్మాణ ఆరోపణలపై ముంబైలోని నాగరిక పాలి హిల్ ప్రాంతంలోని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆఫీస్ బుధవారం పాక్షికంగా కూల్చివేయబడింది. అయితే దాన్ని తిరిగి పునరుద్ధరించబోనని, అక్కడి నుంచే పనిచేస్తానని ఆమె ట్విట్టర్‌లో పేర్కొంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆమె ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌తో (పోకె) పోల్చారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా షూటింగ్స్ లేవు.. దాంతో కూల్చివేసిన బిల్డింగ్ ను పునరుద్ధరించడానికి తన వద్ద డబ్బు లేదని కంగన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. బిజెపి మిత్రపక్షం, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలేతో ఆమె భేటీ అయ్యారు. పరిహారం కోరుకుంటున్నామని చెప్పారు. కంగన కార్యాలయాన్ని కూల్చివేసేందుకు బిఎంసి తీసుకున్న చర్యపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని కూడా కంగన దుయ్యబట్టారు.

Tags

Next Story