జాతీయం

విద్యార్థుల మీద తల్లిదండ్రులు ఒత్తిడి పెంచకూడదు : మోదీ

విద్యార్థుల మీద తల్లిదండ్రులు ఒత్తిడి పెంచకూడదని ప్రధాని మోదీ అన్నారు. వరుసగా నాలుగోసారి పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు.

విద్యార్థుల మీద తల్లిదండ్రులు ఒత్తిడి పెంచకూడదు : మోదీ
X

విద్యార్థుల మీద తల్లిదండ్రులు ఒత్తిడి పెంచకూడదని ప్రధాని మోదీ అన్నారు. వరుసగా నాలుగోసారి పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మోదీ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఏపీలోని ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన విద్యార్థిని పల్లవి అడిగిన ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పారు. పరీక్షలంటే విద్యార్థులు భయపడకూడదని.. తల్లిదండ్రులతో కలిసి కూర్చొని చర్చించుకోవాలని హితువు పలికారు. 2018 నుంచి పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రధాని మోదీ.. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. కరోనా కారణంగా ఈసారి కూడా వర్చువల్ ద్వారా కోట్లాది మంది విద్యార్థులతో మోదీ నేరుగా మాట్లాడారు.

Next Story

RELATED STORIES