Google: గూగుల్ లో ఈ 3 విషయాలు వెతికితే జైలుకే..

Google: ఎవరికి ఏ విషయం తెలియకపోయినా ఉందిగా గూగుల్ మాత అంటూ గూగుల్ ని ఆశ్రయించేస్తున్నారు.. అనారోగ్యానికి సంబంధించిన విషయాల నుండి ఫుడ్ రెసిపీ వరకు ప్రతిదీ తెలుసుకోవడానికి గూగుల్ ని ఉపయోగిస్తారు. గూగుల్ వద్ద అన్ని రకాల ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయని భావిస్తుంటారు. అయితే కొన్నిసార్లు గూగుల్‌లోని సమాచారం సరైనదని మరియు కొన్నిసార్లు తప్పు అని రుజువైంది.
అయితే గూగుల్ లో కొన్ని విషయాలను ఇకపై సెర్చ్ చేయకూడదు. ఇకపై అలా సెర్చ్ చేయడం ప్రారంభిస్తే జైలు శిక్ష ఖాయం. కాబట్టి మీరు గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడల్లా చాలా జాగ్రత్తగా సెర్చ్ చేయాల్సి ఉంటుంది. పొరపాటున కూడా గూగుల్‌లో ఇలాంటి విషయాలు సెర్చ్ చేయకూడదు. అవేంటో తెలుసుకుందాం.
బాంబును ఎలా తయారు చేయాలి
తరచుగా వ్యక్తులు అలాంటి వాటిని గూగుల్ లో శోధిస్తారు. బాంబులను ఎలా తయారు చేయాలి తదితర అనుమానాస్పద విషయాల కోసం వెతకవద్దు. ఎందుకంటే, ఈ కార్యకలాపాలను సైబర్ సెల్ పర్యవేక్షిస్తుంది. ఇలా చేయడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. భద్రతా సంస్థలు మీపై చర్య తీసుకోవచ్చు. ఇందులో మీరు జైలుకు కూడా వెళ్లాల్సి రావచ్చు.
చైల్డ్ పోర్న్
చైల్డ్ పోర్నోగ్రఫీ విషయంలో భారత ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. గూగుల్‌లో చైల్డ్ పోర్న్‌ని సెర్చ్ చేయడం, చూడటం లేదా షేర్ చేయడం నేరం. దీనికి సంబంధించిన చట్టాలను ఉల్లంఘిస్తే జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే.
గర్భస్రావం ఎలా చేయాలి
గూగుల్‌లో అబార్షన్ పద్ధతుల కోసం వెతకడం కూడా నేరం కిందకే వస్తుంది. భారతీయ చట్టాల ప్రకారం, వైద్యుని సలహా లేకుండా అబార్షన్ చేయరాదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com