Draupadi Murmu: గవర్నర్స్ కేరాఫ్ పూర్వాంచల్

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అయితే వివిధ రాజ్‌భవన్‌లలో కొలువుతీరిన గవర్నర్లలో ఎక్కువమంది పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. నిన్న పునర్వ్యవస్థీకరణ జరిగిన తరువాత పూర్వాంచల్‌కు చెందిన ఐదు మంది వివిధ రాష్ట్రాలల్లో గవర్నర్లుగా వ్యవహరిస్తున్నారు.
జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా ఉన్న మనోజ్ సిన్హా పూర్వాంచల్‌లోని ఘాజీపూర్‌కు చెందినవారు. అలాగే రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా కూడా ఘాజీపూర్‌కు చెందినవారే. యూపీలో గత బీజేపీ ప్రభుత్వాలలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఇక బీహార్ నుంచి మేఘాలయకు గవర్నర్‌గా నియమింపబడ్డ ఫాగు చౌహాన్ కూడా పూర్వాంచల్‌లోని అజంగఢ్‌కు చెందినవారే. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన శివప్రతాప్ శుక్లా గోరఖ్‌పూర్‌కు చెందినవారు. ఆయన కూడా యూపీ, కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. ఇక సిక్కిం గవర్నర్‌గా నియమితులైన లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య కూడా వారణాసికి చెందినవారే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com