డిగ్రీ, డిప్లొమా అర్హతలతో డీఆర్‌డీవోలో ఉద్యోగాలు..

డిగ్రీ, డిప్లొమా అర్హతలతో డీఆర్‌డీవోలో ఉద్యోగాలు..
కరోనా కారణంగా ఇంటర్వ్యూ నిర్వహించట్లేదు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ డీఆర్‌డీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డీఆర్‌డీవోకు చెందిన డిఫెన్స్ సైన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సెంటర్ DESICDOC కోసం పలు పోస్టులను భర్తీ చేయనుంది. డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఫోటోగ్రఫీ లాంటి విభాగాల్లో ఉన్న పోస్టుల భర్తీ జరుగుతుంది. మొత్తం ఖాళీలు 16. కరోనా కారణంగా ఇంటర్వ్యూ నిర్వహించట్లేదు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి మాత్రమే సమాచారం వస్తుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అభ్యర్ధులు అక్టోబర్ 19 లోగా అప్లై చేసుకోవాలి. దరఖాస్తుల్ని అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకావాలి. నోటిఫికేషన్‌లో వెల్లడించిన మెయిల్ ఐడీకి పంపాలి.

మొత్తం ఖాళీలు: 16

లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ : 9

కంప్యూటర్ సైన్స్: 6

ఫోటోగ్రఫీ: 1

దరఖాస్తు ప్రారంభం : 2020 అక్టోబర్ 5

దరఖాస్తుకు చివరి తేదీ: 2020 అక్టోబర్ 19

విద్యార్హతలు: లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ పోస్టుకు డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్.

కంప్యూటర్ సైన్స్ పోస్టుకు డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ (బీఈ లేదా బీటెక్ చదివిన వారు అప్లై చేయాలి)

ఫోటో గ్రఫీ పోస్టుకు డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ

ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, మెరిట్

దరఖాస్తులు పంపాల్సిన మెయిల్ ఐడీ: director@desidoc.drdo.in

వెబ్‌సైట్: https://www.drdo.gov.in/

Tags

Next Story