దేశాధ్యక్షుడి తల నరికి దుర్గమ్మ కాళ్ల దగ్గర..

అధ్యక్షుడి తల నరికే అంత ధైర్యం వాళ్లెలా చేశారు.. అయినా ఆయన అంత తప్పు ఏం చేశారు. దేశాధ్యక్షుడికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి.. ఎన్నో అనుమానాలు.. మరెన్నో ఆలోచనలు. ఔను మరి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మీద అంత కోపంగా ఉంది ప్రపంచ ప్రజలందరికీ.. ఇదే మంచి అవకాశం.. దసరా శరన్నవరాత్రులను దుష్ట శిక్షణకు.. శిష్ట రక్షణకు ప్రతీకగా చెబుతారు. ఆయన మీద ఉన్న కోపాన్ని ఇలా వెళ్లగక్కారు కోల్‌కతా వాసులు. ఇది ఓ దుర్గా పెండాల్ (దుర్గామాతను నిలిపిన మండపం)లో కనిపించిన దృశ్యం.
కరోనా వైరస్ మహమ్మారిని ప్రపంచం మీదకు వదిలి చోద్యం చూస్తున్న జిన్‌పింగ్ మీద వ్యతిరేకత ఈ విధంగా పెల్లుబికింది పశ్చిమ బెంగాల్ భక్తులకు. వారి కోపానికి కారణం కరోనా ఒక్కటే కాదు.. భారత భూభాగంలోకి చొరబడేందుకు చైనా చేస్తున్న కుట్ర కూడా. దసరా నవరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు కోల్‌కతా వాసులు. బెరహంపూర్‌లోని ఓ మండపంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను పోలీన విగ్రహం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహానికి సంబంధించిన తల తెగి నేలపై రక్తపు మడుగులో పడి ఉండగా.. అమ్మవారి వాహనమైన సింహం దాని మొండాన్ని తింటున్నట్లుగా విగ్రహాన్ని రూపొందించారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com