E Auction of PM Gifts: జావెలిన్‌కు రూ. కోటిన్నర.. బాక్సింగ్ గ్లోవ్స్‌కు రూ. 91 లక్షలు..

E Auction of PM Gifts: పీఎంకు ప్రతీసారి గిఫ్ట్స్‌గా వచ్చిన పలు విలువైన వస్తువులను వేలం వేయడం ఎప్పుడూ జరిగేదే. అందులో భాగంగానే ఈసారి ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన వారి వస్తువులను పలువురు ఆటగాళ్లు ప్రధాని నరేంద్ర మోడీకి బహుమతులుగా ఇచ్చారు. ఆ వస్తువులను ఇటీవల వేలంలో పెట్టారు. అనూహ్యంగా వేలంలో వాటికి ఎక్కువ ధరే పలికింది. ఆన్‌లైన్‌లో జరిగిన వేలంపాటలో చాలామంది భారతీయులు పాల్గొన్నారు.
ముందుగా ఒలింపిక్స్‌లో ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన ఆటగాడు నీరజ్ చోప్రా. జావెలిన్ థ్రోలో తన ఆటకు యావత్ భారతదేశమంతా ఉప్పొంగిపోయింది. ఇండియాకు ఎప్పుడూ అందని చందమామ లాగా ఉండే ఒలింపిక్స్ గోల్డ్ మనకు అందజేసాడు నీరజ్. అయితే ఒలింపిక్స్‌లో తాను ఉపయోగించిన జావెలిన్ ఏకంగా రూ.1.5 కోట్లు వేలం పలికింది. అన్ని వస్తువుల్లో ఎక్కువ వేలం పలికింది దీనికే.
బాక్సింగ్‌లో కాంస్య పతకం గెలుచుకున్న లోవ్లీనా బోర్గోహెయిన్ ఉపయోగించిన బాక్సింగ్ గ్లోవ్స్‌కు రూ.91 లక్షల ధర వేలంలో పలికింది. పారాలింపిక్స్‌లో జావెలిన్ థ్రోలో గోల్డ్ మెడల్ సాధించింది సుమిత్ అంతిల్ అనే అమ్మాయి. ఇక తాను ఉపయోగించిన జావెలిన్‌కు కూడా రూ. కోటి వేలం పలికింది. ఫెన్సింగ్ అంటే ఏంటో భారతీయులకు తెలియజేసి, ఒలింపిక్స్‌లో అందులో మెడల్‌ను సాధించింది భవాని దేవి. ఒలింపిక్స్‌లో తాను ఉపయోగించిన ఫెన్స్... వేలంపాటలో రూ.1.25 కోట్లు పలికింది. ఈ వేలంపాటలో వచ్చిన డబ్బులన్నీ పీఎం ఫండ్‌కు చేరుతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com