Earthquake : ఢిల్లీ, చెన్నైలలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు

Breaking News : భారత్, నేపాల్‌లో భూకంపం వణికించింది. ఢిల్లీ, చెన్నైలలో పలుచోట్ల భూమి కంపించింది. ఢిల్లీలో భూకంప తీవ్రత 3.6గా నమోదు కాగా.. చెన్నైలోని మౌంట్ రోడ్, వైట్స్ రోడ్‌లో భూప్రకంపనలు రేపాయి.దాంతో జనం భయంతో పరుగులు పెట్టారు. అటు నేపాల్‌లో భూకంప తీవ్రత 5.2గా నమోదు అయింది. ఇప్పటివరకు అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని భారత్, నేపాల్ అధికారులు తెలిపారు.
భారతీయ టెక్టోనిక్ ప్లేట్ ప్రతి సంవత్సరం సుమారు 5 సెం.మీ పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది హిమాలయాలపై ఒత్తిడిని కలుగజేస్తుందని అంటున్నారు. రాబోయే రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, నేపాల్ లో భారీ భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. భూకంప కేంద్రం భూమికి 10కిలోమీటర్ల లోతులో ఉందని ఏజెన్సీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలకు ఉత్తరాన 56కిలోమీటర్ల దూరంలో మంగళవారం రాత్రి 10.38 ప్రాంతంలో 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com