కార్గిల్, అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

కార్గిల్, అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం
దేశంలో పలు ప్రాంతాల్లో వరుసగా భూప్రకంపనలు సంభవిస్తున్నాయి

దేశంలో పలు ప్రాంతాల్లో వరుసగా భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. మంగళవారం ఉదయం 3.00 గంటలకు అండమాన్ నికోబార్ దీవుల్లో డిగ్లీపూర్ కు తూర్పు, ఆగ్నయంగా 20 కిలోమీటర్ల దూరంలో రిక్టారు స్కేలుపై 4.0 తీవ్రతతో భూమి కంపించింది. ఉత్తర భారతదేశాన్ని వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జమ్మూ కశ్మీర్ లోని లడ్డాఖ్ కు ఉత్తర-వాయువ్య దిశలో 435 కిలోమీటర్ల దూరంలో నమోదైంది. రిక్టారు స్కేలుపై 4.4 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ తెలిపింది. అయితే, ఆస్థి, ప్రాణనష్టం జరగలేదని తెలుస్తుంది. కరోనా కాలంలో వరుస భూకంపాలు దేశంలో పలు ప్రాంతాల్లో ఆందోళన కలిగిస్తుంది.

Tags

Next Story