లద్ధాఖ్‌లో వరుస భూకంపాలు.. భయాందోళనలో స్థానికులు

లద్ధాఖ్‌లో వరుస భూకంపాలు.. భయాందోళనలో స్థానికులు
X
జమ్మూకశ్మీరులోని లద్దాఖ్ ను వరుస భూకంపాలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం 5.4 తీవ్రతతో భూకంపం

జమ్మూకశ్మీరులోని లద్దాఖ్ ను వరుస భూకంపాలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం 5.4 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. అయితే, 10 గంటలలు తిరగక ముందే శనివారం తెల్లవారుజామున మరోసారి భూకంపం సంభవించింది. రాత్రి 2.14 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో రిక్టారు స్కేలుపై 3.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, దీని వలన ఎలాంటి ప్రాణ నష్టం కాని, ఆస్తినష్టం కాని జరగలేదు. కాని పది గంటల వ్యవధిలో రెండు సార్లు భూకంపం సంభవించడంతో లద్దాఖ్ ప్రజలు కలవర పడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 4.27 గంటలకు లద్దాఖ్‌ను భూకంపం కుదిపేసింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 5.4గా నమోదైంది.

Tags

Next Story