మహారాష్ట్రలో వరుస భూకంపాలు

X
By - shanmukha |11 Sept 2020 9:43 AM IST
మహారాష్ట్రలో వరుస భూకంపాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కరోనాకు తోడు భూకంపాలతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతుంది.
మహారాష్ట్రలో వరుస భూకంపాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కరోనాకు తోడు భూకంపాలతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతుంది. శుక్రవారం తెల్లవారు జామున 3.57 గంటలకు రిక్టార్ స్కేలుపై 3.5 తీవ్రతతో నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. మరోవైపు నాసిక్ సమీపంలో ఉదయం 7.06 గంటలకు రిక్టారు స్కేలుపై 3.6 తీవ్రతతో భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానిక ప్రజలు ఆందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే, వరుస భూకంపాలు సంభవించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. గడిచిన వారం రోజుల్లో మహారాష్ట్రలో సుమారు నాలుగు సార్లు భూమి కంపించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com