మిజోరాంలో మరోసారి కంపించిన భూమి

X
By - Admin |29 Aug 2020 8:04 AM IST
ఈశాన్య భారతదేశంలో వరుస భూకంపాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మిజోరంలో 24 గంటల్లో పలుసార్లు భూమి కంపించింది.
ఈశాన్య భారతదేశంలో వరుస భూకంపాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మిజోరంలో 24 గంటల్లో పలుసార్లు భూమి కంపించింది. శుక్రవారం తూర్పు ఛాంపై ప్రాంతంలో గంట వ్యవధిలో మూడు సార్లు భూమి కంపించి స్థానికులను భయాందోళనలకు గురిచేసిన విషయం తెలిసిందే. ఇది ఉండగా మళ్లీ శనివారం అర్థరాత్రి రిక్టార్ స్కేలుపై 3.7తీవ్రతో మరోసారి కంపించింది. ఈ రెండు రోజుల ఏర్పడిన ప్రకంపనలకు 31కి పైగా నిర్మాణాలు దెబ్బతిన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు తెలిపారు. అటు, వరుస భూకంపాలతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. మిజోరాంలో జూన్ 22 నుంచి తరచూ భూకంపనలు చోటు చేసుకుంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com