ఉత్తరాదిని వణికించిన భూ ప్రకంపనలు.. ఇళ్లలోంచి జనం పరుగులు

ఉత్తరాదిని వణికించిన భూ ప్రకంపనలు.. ఇళ్లలోంచి జనం పరుగులు
ఏం జరుగుతోందో అర్థంకాక జనం భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టారు. రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయం భయంగా గడిపారు.

ఉత్తర భారతాన్ని భూ ప్రకంపనలు వణికించాయి.. రాత్రి 10.30 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో పరుగులు తీశారు.. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.. ఢిల్లీలో 6.1 తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నట్లుగా తెలిపారు. భూమి ఒక్కసారిగా కంపించడంతో ఏం జరుగుతోందో అర్థంకాక జనం భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టారు. రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయం భయంగా గడిపారు.

పంజాబ్‌లోనూ భారీ స్థాయిలో భూకంపం సంభవించింది.. అమృత్‌సర్‌కు 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు.. రిక్టర్‌ స్కేల్‌పై 6.1గా తీవ్రత నమోదైంది.. రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాయి.

తజకిస్థాన్‌లో మొదట ప్రకంపనలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.. భూ ఉపరితలానికి పది కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తజకిస్థాన్‌లో రిక్టర్‌ స్కేలుపై 6.3గా తీవ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్‌లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.. 6.4 తీవ్రతతో భూమి కంపించినట్లుగా భారత జాతీయ భూకంప కేంద్రం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story