Economic Survey 2022-23: ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

Economic Survey 2022-23: ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
2023-24లో దేశ ఆర్థిక వృద్ధిరేటు 6నుంచి 6.8 శాతంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు


2022-23 ఆర్థిక సర్వేను లోక్ సభలో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ సమావేశాలలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం తర్వాత సీతారామన్ సర్వేను ప్రవేశపెట్టారు. ఆర్థిక సర్వే అనంతరం లోక్ సభను రేపటి వాయిదా వేశారు. 2023-24లో దేశ ఆర్థిక వృద్ధిరేటు 6నుంచి 6.8 శాతంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధిరేటు 7శాతం ఉంది. 2022-23 ఆర్థిక రిపోర్ట్ లో కొవిడ్ సమయంలో ఆర్థికంగా నష్టపోయిన వాటిని తిరిగి పునరుద్దరించుకుందని తెలిపింది. మందగించిన వాటిని పునరుత్తేజం చేసిందని పేర్కొంది.

కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ముందు గతేడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంట్ ఉబయసభలో ప్రవేశపెట్టడం ఆనవాయితీ. అందుకు అనుగుణంగానే గత ఆర్థిక రిపోర్ట్ ను ప్రవేశ పెట్టారు.
ఆర్థిక రిపోర్ట్ అంటే రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా దేశం ఎదుర్కోబోయే సవాళ్లను ముందుగా నిపుణులు అంచనా వేస్తారు. ఆర్థిక మంత్రిత్వశాఖ రూపొందించే ఈ సర్వేలో... రాబోయే సవాళ్లను ఎలా ఎదుర్కోనున్నామో తెలియజేస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story