Enforcement Directorate : నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు ఈడీ సమన్లు

Enforcement Directorate : నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తెలిపారు. ఈ నెల 8న ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని ఈడీ కోరినట్లు తెలిపారు. అయితే... మనీలాండరింగ్ సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవన్నారాయన. ఈడీ నోటీసులు జారీ చేసినందున.... సోనియాగాంధీ ఈనెల 8న ఈడీ కార్యాలయానికి వెళ్తారని తెలిపారు ఈ పార్టీ అభిషేక్ మను సింఘ్వీ.
మరోవైపు రాహుల్ విదేశీ పర్యటనలో ఉన్నారని... ఆ లోపు తిరిగి వస్తే ఈడీ ఎదుట హాజరవుతారన్నారు. లేకపోతే కొంత సమయం కోరే అవకాశం ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా.. ఈడీ నోటీసులపై రణదీప్ సూర్జేవాలా విమర్శలు గుప్పించారు. ప్రతిసారీ నేషనల్ హెరాల్డ్‌ను లక్ష్యంగా చేసుకుంటూ.. మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
నేషనల్ హెరాల్డ్ పత్రికను 1942లో ప్రారంభించారని, అప్పట్లో బ్రిటిష్ వారు దాన్ని అణవిచివేసేందుకు ప్రయత్నించారని, ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఈడీని ఉపయోగించుకుంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com