New Governors In 8 states : 8 రాష్ట్రాలకు గవర్నర్లను మార్చిన కేంద్రం..!

New Governors In 8 states : 8 రాష్ట్రాలకు గవర్నర్లను మార్చుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన BJP సీనియర్ నేత, విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబును మిజోరం గవర్నర్‌గా నియమించారు. ఇక హిమాచల్ గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయ హర్యానాకు వెళ్తున్నారు. హిమాచల్ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్‌ను నియమించిన కేంద్రం, కర్నాటక గవర్నర్‌గా థావర్‌చంద్ గెహ్లాట్‌కు బాధ్యతలు అప్పచెప్పింది. మధ్యప్రదేశ్ గవర్నర్‌గా మంగూభాయ్ పటేల్, గోవా గవర్నర్‌గా శ్రీధరన్ పిళ్లై, త్రిపుర గవర్నర్‌గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య లను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కేంద్ర కేబినెట్ విస్తరణ రేపో, ఎల్లుండో ఉంటుందనే వార్తల మధ్యే.. గవర్నర్ల బదిలీలు, కొత్తవారికి అవకాశం కల్పించడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com