Rajasthan: పెళ్లైన 54 ఏళ్లకు తల్లిదండ్రులైన వృద్ధ దంపతులు..

Rajasthan: పెళ్లైన 54 ఏళ్లకు తల్లిదండ్రులైన వృద్ధ దంపతులు..
Rajasthan: 70 ఏళ్లు పైబడిన ఈ దంపతులకు పెళ్లయిన 54 ఏళ్ల తర్వాత మగబిడ్డ జన్మించాడు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ద్వారా ఈ అవకాశం కలిగింది.

Rajasthan: 70 ఏళ్లు పైబడిన ఈ దంపతులకు పెళ్లయిన 54 ఏళ్ల తర్వాత మగబిడ్డ జన్మించాడు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ద్వారా ఈ అవకాశం కలిగింది. మొదటి సార్లు ఫెయిలయినా మూడోసారి ఫలించి బిడ్డ పుట్టాడు.

బంగ్లాదేశ్ యుద్ధంలో జుంజునులోని నుహానియా గ్రామానికి చెందిన రిటైర్డ్ సైనికుడు గోపీచంద్ పాల్గొన్నారు. అప్పుడు ఆయన కాలికి గాయం అయ్యింది.

"తొలి బిడ్డ ఆనందాన్ని నేను చెప్పలేను. నా కల నిజమైంది" అని గోపీచంద్ అన్నారు. మా తల్లిదండ్రులకు నేనొక్కడినే సంతానం, ఇప్పుడు నా వంశం ఈ బిడ్డతోనే సాగుతుంది'' అని అన్నారు.

కొడుకు పుట్టాడని గోపీచంద్ భార్య చంద్రావతి కూడా సంతోషిస్తోంది. ఐవీఎఫ్ నిపుణుడు డాక్టర్ పంకజ్ గుప్తా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఈ వయసులో పిల్లలు పుట్టిన సందర్భాలు చాలా తక్కువ. రాజస్థాన్‌లో 70 ఏళ్లున్న మహిళకు బిడ్డ పుట్టడం ఇదే తొలిసారి. బిడ్డ ఆరోగ్యంగా జన్మించాడని గుప్తా చెప్పారు.

జూన్ 2022 నుండి అమలులోకి వచ్చిన ఒక చట్టాన్ని ఇటీవల పార్లమెంటు ఆమోదించింది. దాని ప్రకారం, ఏ IVF కేంద్రం కూడా 50 ఏళ్లు పైబడిన స్త్రీలు మరియు పురుషులకు చికిత్స అందించకూడదు. అయితే చట్టం అమల్లోకి రాకముందే మహిళ గర్భం దాల్చడం విశేషం.

చంద్రావతికి సిజేరియన్ ఆపరేషన్ చేసిన వైద్యురాలు కల్నల్ రీనా యాదవ్ కూడా సైనికురాలు కావడం యాదృచ్ఛికం.

Tags

Read MoreRead Less
Next Story