జమిలీ ఎన్నికలపై తాము సిద్ధం : కేంద్ర ఎన్నికల సంఘం

జమిలీ ఎన్నికలపై తాము సిద్ధం :  కేంద్ర ఎన్నికల సంఘం
X

Sunil Arora

జమిలీ ఎన్నికలపై ప్రధాని మోదీ తాజాగా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు

జమిలీ ఎన్నికలపై ప్రధాని మోదీ తాజాగా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. 'ఒకే దేశం... ఒకే ఎలక్షన్' అన్న నూతన పద్ధతిని అమలు చేయడానికి సిద్ధమన్నారాయన. పార్లమెంట్ విస్తృతమైన సవరణలు చేసిన తర్వాత వన్ కంట్రీ- వన్ నేషన్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమని ప్రకటించారు.

రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా శాసన వ్యవహారాల ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సుకు మోదీ హజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ దేశంలో జమిలీ ఎన్నికలు అనే అంశం చర్చించే విషయం మాత్రమే కాదని, భారత్‌కు ఎంతో అవసరమన్నారు. కొన్ని నెలల వ్యవధిలోనే పదే పదే ఎన్నికలు నిర్వహించడం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయన్నారు. అందుకే వీటిని ఒకేసారి నిర్వహించడంపై దృష్టి సారించాలని సూచించారు.

Tags

Next Story