కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం

కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం
పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్నఅసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల తేదీలు ఖారారు చేయడంపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశమైంది. పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల తేదీలు ఖారారు చేయడంపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి మొదటివారంలో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. బెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వాహణపై చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే పశ్చిమ బెంగాల్‌లో శాంతి భద్రతలపై కేంద్ర ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో కీలకంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీ, తెలంగాణలోనూ ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ వెలువడాల్సి ఉంది.



Tags

Read MoreRead Less
Next Story