Election Result : ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతున్న కౌంటింగ్‌

Election Result : ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతున్న  కౌంటింగ్‌
మూడు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున స్థానాలున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కచ్చితంగా గెలవాల్సిన సీట్లు 31. అంటే, మ్యాజిక్‌ ఫిగర్‌ 31

ఈశాన్య రాష్ట్రాల్లో కౌంటింగ్‌ కొనసాగుతుంది.మధ్యాహ్ననికి ఎన్నికల పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మూడు రాష్ట్రాల్లో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే నాగాలాండ్, మేఘాయాల్లో ఒక్కో సీటు ఏకగ్రీవం అయ్యాయి. మేఘాలయలో 78శాతం, నాగాలాండ్ లో 86శాతం, త్రిపురలో 87శాతం పోలింగ్ నమోదైంది.

గెలుపెవరిదో, ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టారో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. మూడు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున స్థానాలున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కచ్చితంగా గెలవాల్సిన సీట్లు 31. అంటే, మ్యాజిక్‌ ఫిగర్‌ 31 అన్నమాట. అయితే, మేఘాలయలో మొత్తం 60 సీట్లుంటే 59 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. యూడీపీ అభ్యర్ధి ఆకస్మిక మరణంతో ఒకచోట ఎన్నిక వాయిదా పడింది.

ప్రస్తుతం త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఉండగా, మేఘాలయలో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ… ఎన్‌పీపీ అధికారంలో ఉంది. ఇక నాగాలాండ్‌లో నార్త్‌ ఈస్డ్‌ డెమొక్రటిట్‌ అలయన్స్‌ గవర్నమెంట్‌ కొనసాగుతోంది. ఈసారి నాగాలాండ్‌, మేఘాలయలో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. త్రిపురలో హంగ్‌ తప్పకపోవచ్చని అంచనా . కొత్తగా తెరపైకి వచ్చిన టిప్రా మోతా కనీసం 15 స్థానాలకు పైగా గెలుచుకుని కింగ్‌మేకర్‌గా మారొచ్చని జోస్యం చెప్పాయి.

Tags

Read MoreRead Less
Next Story