Elections : నాగాలాండ్ లో ప్రారంభమైన ఎన్నికలు, ఓటు వేసిన సీఎం

Elections : నాగాలాండ్ లో ప్రారంభమైన ఎన్నికలు, ఓటు వేసిన సీఎం
అధికార నేషనల్ డెమోక్రెటిక్ పార్టీ (NDPC) బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తోంది. ఎన్డీపీసీ 40 స్థానాల్లో, బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి

నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 60 స్థానాల్లో 59 స్థానాలకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని పార్టీలనుంచి 183 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 4గంటల వరకు కొనసాగనుంది. అధికార నేషనల్ డెమోక్రెటిక్ పార్టీ (NDPC) బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తోంది. ఎన్డీపీసీ 40 స్థానాల్లో, బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ , నాగా పీపుల్ ఫ్రంట్ 23, 22 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.

ఎన్నికల కోసం 2,291 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఇప్పటికే నాగాల్యాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో టు ఓటు వేశారు. నాగాలాండ్ సీఎం నీఫియు రియో టు ఫెమాలోని పోలింగ్ స్టేషన్ లో ఓటు వేశారు. అనంతరం.. ఓటు వేయడం కేవలం హక్కు కాదని బాధ్యత అని ఆయన సోషల్ మీడియాలో తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story