Elon Musk: ట్విట్టర్ బాస్ కు పూజలు...

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కైవసం చేసుకున్న నాటి నుంచి సంస్థను లాభాల బాట పట్టించేందుకు అతి కర్కశమైన నిర్ణయాలు తీసుకుంటూ ఖ్యాతికెక్కిన వైనం చూస్తూనే ఉన్నాం. అతడి దందుడుకు వ్యవహారంపై ప్రపంచం నలుమూలల నుంచి భారీ ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ, ఈ అపర కుబేరుడు ఓ వర్గానికి మాత్రం స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. కేవలం స్పూర్తి మాత్రమే కాదు. ఆ అభిమానం ఏకంగా ఆరాథనగానూ మారింది. అందుకే మస్క్ మామ ఫొటోను ప్రతిష్ఠించి ఏకంగా పూజలు కూడా చేసేస్తున్నారు. బెంగళూరులోని సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్(SIFF) ఆధ్వర్యంలో... మెన్స్ లైఫ్ మేటర్స్(Men's Life matters)అని బ్యానర్ కట్టి మరీ ఈ పూజలు నిర్వహిస్తున్నారు కొంత మంది పురుషులు. అగర్భత్తిని వెలిగించి మంత్రాలు కూడా జపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పూజలు చేస్తున్న పురుషులు వోక్ అసుర (Woke Asura) అని నినదించడం మరింత విడ్డూరంగా ఉంది. స్త్రీవాదులను తరిమికొట్టే దైవంగా మస్క్ ను కొనియాడటం వారి మానసిక స్థితికి అద్దం పడుతోంది. మరి ఇదే ఊపులో ఎలాన్ మస్క్ కు గుడి కూడా కట్టించేసినా ఆశ్చర్యపోనవసరంలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com