Bhagalpur Railway Station: తల్లి మరణించిందని తెలియక.. ఆమె ఒడిలోనే ఆదమరిచి..

Bhagalpur Railway Station: తన తల్లి నిద్రిస్తోందని భావించిన బాలుడు ఆమెను మళ్లీ మళ్లీ లేపేందుకు ప్రయత్నిస్తున్నాడు. చాలా సేపు ఆ అమాయకపు చిన్నారి తల్లితో ఆడుకుంటూనే ఉన్నాడు. అయితే తల్లి మృతదేహం కదలకపోవడాన్ని చూసి ప్రజలు జీఆర్పీకి సమాచారం అందించారు.
బీహార్‌లోని భాగల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఓ హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను కంటతడిపెట్టిస్తోంది. తన తల్లి లోకాన్ని విడిచి వెళ్లిపోయిందని అతని చిన్నారి మనసుకు తెలియదు. పాలు తాగేందుకు ప్రయత్నించాడు, తన తల్లి వెనుక దాక్కుని ఆనందం పొందుతున్నాడు. అయితే ఈ ఘటనను చూసిన రైలు ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కదిలిపోయారు, చాలా మంది కంటతడి పెట్టారు. తన తల్లి ఇక లేదని, రాదని తెలియని ఆ చిన్నారికి ఎవరు అమ్మ ప్రేమను పంచుతారు.. ఎవరు ఆదరిస్తారు అని ప్రయాణికులు చర్చించుకుంటున్నారు.
భాగల్‌పూర్ స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నెం.1 దగ్గర ఆమె మృతదేహాన్ని ఎవరో ఉంచారు. అక్కడ మహిళ ఐదేళ్ల కుమారుడు ఆమెతో ఆడుకుంటున్నాడు. తన తల్లి చనిపోయిందని ఆ ససిమనసుకు తెలియదు. తన తల్లి నిద్రిస్తోందని భావించిన బాలుడు ఆమెను లేపేందుకు ప్రయత్నిస్తున్నాడు. చాలా సేపు ఆ అమాయకపు చిన్నారి తల్లితో ఆడుకుంటూనే ఉన్నాడు. అయితే ఆమె కదలకపోవడంతో మృతి చెంది ఉండవచ్చని ప్రయాణీకులు భావించి జీఆర్పీకి సమాచారం అందించారు. అనంతరం రైల్వే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
రైల్వే పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దీంతో పాటు చిన్నారిని పోలీసులు 'చైల్డ్ హెల్ప్‌లైన్ టీమ్'కి అప్పగించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com