మళ్లీ లాక్‌డౌన్.. కొత్త స్ట్రెయిన్ కలకలం

ఇంగ్లండ్‌లో దాదాపు 56 మిలియన్ల మంది ప్రజలు మళ్లీ లాక్‌డౌన్ ఆంక్షల్లో ఉన్నారు. ఫిబ్రవరి మధ్య వరకు కొనసాగే ఈ లాక్‌డౌన్ ద్వారా స్ప్రెడ్డింగ్ ఇన్ఫెక్షన్ రేట్లను తగ్గించడానికి ఇంగ్లండ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ సోమవారం చెప్పారు.
ప్రాధమిక, మాధ్యమిక పాఠశాలల మూసివేతతో సహా ఈ చర్యలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని టెలివిజన్ ప్రసంగంలో చెప్పారు. ఇప్పటికే దేశంలో అనేక మంది కరోనాతో మరణించారు. జాన్సన్ మాట్లాడుతూ, సోమవారం నాటికి, కోవిడ్తో దాదాపు 27,000 మంది ఆసుపత్రిలో ఉన్నారు - గత ఏడాది ఏప్రిల్‌లో నమోదైన కరోనా కేసుల గరిష్ట స్థాయి కంటే 40 శాతం ఎక్కువ అని అన్నారు.
గత మంగళవారం, కేవలం 24 గంటల్లో 80,000 మందికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో చాలా మంది ఇప్పటికే కొత్త స్ట్రెయిన బారిన పడినందున టీకాలు తయారుచేసేటప్పుడు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త వేరియంట్‌ను అదుపులోకి తీసుకురావడానికి కలిసి కట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com