ఇకపై ఈఎస్ఐ వినియోగదారులు అత్యవసర సేవల కోసం..

ఇకపై ఈఎస్ఐ వినియోగదారులు అత్యవసర సేవల కోసం..
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) అత్యవసర సేవల విషయంలో

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) అత్యవసర సేవల విషయంలో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకోవచ్చని లబ్ధిదారులకు అనుమతులు మంజూరు చేసింది. గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్ట్ వంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇఎస్ఐసి బోర్డులో ఉన్న తివారీ చెప్పారు.

ESIC చందాదారులు అత్యవసర చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించగలరు. ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్నవారికి కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సేవల (సిజిహెచ్ఎస్) రేట్ల ప్రకారం రీయింబర్స్‌మెంట్ ఉంటుంది.

10 కిలోమీటర్ల పరిధిలో ఇఎస్ఐసి ఆసుపత్రి లేనట్లయితే చందాదారులకు ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్య సేవలను పొందటానికి అనుమతి ఉంది. తివారీ తమ లబ్ధిదారులకు ఆరోగ్య సేవల నాణ్యతను కాపాడటానికి రాబోయే కాలంలో మరిన్న ఆసుపత్రులను నడుపుతుందని తెలిపారు. సుమారు 26 ఈఎస్ఐ ఆస్పత్రులు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు.

ESIC నిర్వహిస్తున్న అటల్ బిమిట్ వ్యక్తి కళ్యాణ్ యోజన కింద నిరుద్యోగ భృతి పొందే కాలపరిమితిని 2021 జూన్ 30 వరకు పొడిగించే ప్రతిపాదనను బోర్డుఆమోదించినట్లు తివారీ తెలిపారు. ప్రస్తుత గడువు 2020 డిసెంబర్ 31. ఈ ఏడాది ఆగస్టులో కోవిడ్ దృష్ట్యా మార్చి 24 నుండి ఉద్యోగాలు కోల్పోయిన వారికి సహాయపడటానికి ఈ పథకం కింద నిరుద్యోగ భృతిని మూడు నెలల సగటు వేతనంలో 50 శాతానికి రెట్టింపుగా ఇవ్వడానికి బోర్డు నిబంధనలను సడలించింది.

Tags

Next Story