Etela Rajender: కారు దిగి కమలం పార్టీలోకి.. బీజేపీలో చేరిన ఈటల

Etela Rajender: తెలంగాణ మాజీ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ సోమవారం పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో భారతీయ జనతా పార్టీ ( బిజెపి) లో చేరారు.తెలంగాణ మాజీ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ సోమవారం పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో భారతీయ జనతా పార్టీ ( బిజెపి) లో చేరారు. దిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈటలతో పాటు మాజీ ఎంపీ రమేశ్ రాఠోడ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ తుల ఉమ, ఆర్టీసీ కార్మిక సంఘ నేత అశ్వత్థామ రెడ్డి, పలువురు నేతలు బీజేపీలో చేరారు.
ఈటలకు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని ధర్మేంద్ర ప్రధాన్ అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
భూ కబ్జా ఆరోపణలపై మే 1 న క్యాబినెట్ నుంచి ఈటల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించింది అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ. తనను పార్టీ అన్యాయంగా టార్గెట్ చేసిందని మంత్రి వాపోయిన విషయం తెలిసిందే. కాగా, తెలంగాణ ప్రభుత్వంలో ఈటల కీలక పాత్ర పోషించారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తాము సత్తా చాటబోతున్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. ఈటల వంటి నేతల చేరికతో భాజపా బలపడుతోందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com