M Manikandan arrested : మాజీ మంత్రి, అన్నాడీఎంకే నేత M మణికందన్ అరెస్ట్..!
M Manikandan arrested : రేప్, అబార్షన్, చీటింగ్ కేసులో తమిళనాడు మాజీ మంత్రి, అన్నాడీఎంకే నేత M మణికందన్ అరెస్టయ్యారు. కొద్ది రోజులుగా తప్పించుకుతిరుగుతున్న ఆయన్ను బెంగళూరులో అదుపులోకి తీసుకుని చెన్నైకి తరలించారు. సినీనటిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన కేసులో.. ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మలేషియన్ పౌరసత్వం ఉన్న మహిళ, సినీ నటి శాంతిని కొన్నాళ్ల కిందటే మణికందన్‌తో తనకు ఉన్న రిలేషన్‌పై నోరు విప్పారు. భార్య నుంచి విడాకులు తీసుకున్నాక తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశారని ఆరోపించారు.
అలాగే తామిద్దరం కలిసి ఉన్న ఫోటలను కూడా మీడియాకు చూపించారు. 2017 నుంచి ఐదేళ్లు తాము ఢిల్లీ, చెన్నైల్లో కలిసే ఉన్నామంటూ చెప్పారు. పెళ్లి విషయం వాయిదా వేసేందుకు తనకు పలుమార్లు అబార్షన్ కూడా చేయించారని, భౌతిక దాడులకు సైతం దిగారంటూ ఆమె ఫిర్యాదు చేశారు. ఐతే.. ఈ ఆరోపణల్ని మణికందన్ ఖండిచారు. తనను బ్లాక్‌మెయిల్ చేసి బెదిరించేందుకే ఇలా కుట్రలు చేస్తున్నారని కౌంటర్ ఎటాక్ చేశారు. ఈ కేసులో అరెస్టు తప్పదనే భయంతో ముందస్తు బెయిల్ కోసం కూడా అప్లై చేసుకున్నా మద్రాస్ హైకోర్టు అందుకు తిరస్కరించింది.
బుధవారం బెయిల్ తిరస్కారానికి గురవడంతో.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చివరికివాళ చెన్నై పోలీసులు ఆయన్ను బెంగళూరులో అరెస్టు చేశారు. తమిళనాట వ్యాప్తంగా మాజీ మంత్రి అరెస్టు కావడం సంచలనంగా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com