భారత్ బంద్‌కు సిద్దమైన రైతు సంఘాలు

కేంద్రప్రభుత్వం తీసుకొస్తున్న వ్యవసాయబిల్లులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. శుక్రవారం భారత్ బంద్ నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. దీనిని 25కుపైగా రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐఎఫ్‌యూ), భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ), ఆలిండియా కిసాన్ మహాసంఘ్ (ఏఐకేఎం) వంటి రైతు సంఘాలు దేశవ్యాప్త బంద్‌లో పాల్గొనున్నాయి. అటు రైతు సంఘాలతో పాటు పలు కార్మిక సంఘాలు కూడా ఈ బంద్ కు మద్దతు ప్రకటించాయి.
పంజాబ్ లో ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు రైల్ రోకో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, రైల్వే అధికారులు ముందుగానే అప్రమత్తమై ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా 26వ తేదీ వరకు 14 జతల ప్రత్యేక రైళ్లను రద్దుచేసినట్టు ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com