జాతీయం

సుచేత రాగి లడ్డు వ్యాపారం.. పెట్టుబడి రూ.5వేలు.. సంపాదన రూ. లక్షలు

ఏ వ్యాపారం చేయాలన్నా లక్షల్లో పెట్టుబడి.. పనివాళ్లు చాలా మంది కావాలి. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని బలవర్ధకమైన ఆహారం

సుచేత రాగి లడ్డు వ్యాపారం.. పెట్టుబడి రూ.5వేలు.. సంపాదన రూ. లక్షలు
X

ఏ వ్యాపారం చేయాలన్నా లక్షల్లో పెట్టుబడి.. పనివాళ్లు చాలా మంది కావాలి. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని బలవర్ధకమైన ఆహారం తయారు చేసి అదే బిజినెస్‌గా మార్చుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. అమ్మానాన్న చిన్నప్పుడు అలవాటు చేసిన ఆరోగ్యకరమైన అలవాట్లు.. ఆమె వ్యాపారానికి ప్రేరణ అయ్యాయి.

సుచేత భండార్ ఓ రైతు కుమార్తె. నాసిక్‌లోని వాడ్నర్ భైరవ్ గ్రామంలో పెరిగిన సుచేత, స్నాక్స్‌లో వేరుశెనగ, బెల్లం వంటి పదార్థాలతో తయారు చేసిన ఆరోగ్యకరమైన లడ్డూలు తినేది.

వ్యవసాయం మీద ఆసక్తితో అగ్రికల్చర్ స్టడీస్ చేయాలనుకున్నా.. కుదరక బీకామ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తర్వాత, దాదాపు ఏడు సంవత్సరాల పాటు సుచేత పూణేలో ఓ కాల్ సెంటర్ నడిపేది., "అది బాగా చేస్తున్నప్పటికీ, ఎప్పుడూ ఏదో లోటుగా అనిపించేది. తను చేయాల్సింది ఇది కాదు.. ఇంకా ఏదో ఉంది అని ఎప్పుడూ అదే ఆలోచనలో మునిగిపోయేది. అక్కడి నుంచి ఇంటికి వచ్చి అమ్మానాన్నతో కలిసి వ్యాపారం ప్రారంభించింది.

రూ. 5,000 పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించిన సుచేత ఇప్పుడు నెలకు దాదాపు లక్ష రూపాయలు సంపాదిస్తోంది.

రాగిలడ్డులే ఆమె బిజినెస్..

ముడి ధాన్యాలంటే బలవర్ధక పదార్థాలు.. పోషకాలు అధికంగా ఉన్న రాగులకు మరికొన్ని వస్తువులు మిళితం చేస్తే రుచితో పాటు ఆరోగ్యం అని భావించింది. రాగి పిండి, అవిసె గింజల పొడి, బాదం పొడి, ఎండు ఖర్జూరం పొడి, ఏలకుల పొడి, బెల్లం, ఆవు నెయ్యి కలిపి లడ్డూలు తయారు చేసింది. 16 లడ్డూలు కలిపి ఒక బాక్సులో పెట్టి దాన్ని రూ.439లకు విక్రయించేది. ఈ బిజినెస్ అంతా ఆన్‌లైన్‌లోనే జరిగేది. ఈ పని కోసం ఏడుగురు గ్రామీణ మహిళలను పనిలోకి తీసుకుంది. వీళ్లందరూ కలిసి నెలకు దాదాపు 2,500 లడ్డూలు తయారు చేస్తారు.

లడ్డూలతో పాటు మరికొన్ని చిరుతిండ్లు..

ఒక్క లడ్డూలతో ఆగిపోలేదు సుచేత బిజినెస్.. అటుకులు, మురమురాలతోనో మిక్చర్ వంటివి తయారు చేసి విక్రయిస్తోంది. నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తోంది. ఇందుకోసం ఆమె పెద్ద పెద్ద షాపులు లాంటివి ఏమీ తీసుకోలేదు.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చిన వారికి ఫ్రెష్‌గా అప్పటికప్పుడు తయారు చేసి పంపిస్తుంది.

చదువుకునే రోజుల్లో కానీ, ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడూ అలసిపోవడం, నీరసంగా అనిపించడం ఎరగదు.. దీనికి కారణం తాను చిన్నప్పుడు తీసుకున్న ఆహారమే అని గుర్తించింది. దాంతో ఆ ఆహార పదార్ధాలనే వ్యాపార సూత్రంగా మలచుకొని సక్సెస్ అయింది.

అయితే తాను తయారు చేసే లడ్డూల్లో ఉపయోగించే పదార్థాలన్నీ సేంద్రియ ఎరువులు ఉపయోగించి పండించినవే వాడాలని మొదటి రోజే నిశ్చయించుకుంది. అందుకోసం సేంద్రియ వ్యవసాయం చేసే రైతులను కలిసింది. తనకు కావలసిన వస్తువులను నేరుగా వారి వద్దనే కొనుగోలు చేయడం మొదలు పెట్టింది. ఇంకా రాగి లడ్డూల్లో ఏయే పదార్ధాలు జోడిస్తే మంచిదని కొంతమంది న్యూట్రీషనిస్ట్‌లనూ కలిసి అడిగింది. దానికి వారు అవిసె గింజలను కూడా సూచించడంతో లడ్డూల్లో వాటినీ చేర్చింది. మొదట తాను అనుకున్న అన్ని పదార్ధాలు కలిపి కమ్మని లడ్డూలు తయారు చేసి బంధువులు, స్నేహితులకు ఇచ్చి టేస్ట్ చేసి ఏమైనా లోటు పాట్లు ఉంటే చెప్పమంది. రుచిగా ఉండేందుకు ఇంకా ఏం చేయాలో సలహాలు కోరింది. వారిచ్చిన సూచనలు, సలహాలు ఆమె బిజినెస్‌ని మరింత వృద్ధి చేశాయి.

సుచేత తన ఆన్‌లైన్ వ్యాపారానికి 'ఎర్త్‌పూర్ణ' అని పేరు పెట్టింది. అంటే సంపూర్ణ భూమి అని అర్థం. సహజ పద్దతిలో పద్దతిలో పండించి మనం ఉపయోగించిన తరువాత మిగిలిన వ్యర్థాలు భూమిలో కలిసినా పర్యావరణానికి, భూమికి నష్టం జరగకుండా ఉంటుంది అని సుచేత చెబుతుంది.

Next Story

RELATED STORIES