ఆర్టికల్ 370 రద్దుపై ఫరూఖ్ అబ్ధుల్లా సంచలన వ్యాఖ్యలు

ఆర్టికల్ 370 రద్దుపై ఫరూఖ్ అబ్ధుల్లా సంచలన వ్యాఖ్యలు
X
జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్ధుల్లా సంచలన

జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్ధుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో కశ్మీరీలు రెండో శ్రేణి పౌరులుగా గుర్తింపు పొందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీరీలు భారతీయులుగా ఉండాలని కోరుకోవడం లేదని అన్నారు. భారత్ కంటే చైనా పాలన నయమని కశ్మీరీలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు కాశ్మీరీలకు ఏమాత్రం ఇష్టం లేదని అన్నారు. పోలీస్‌ నిర్బంధాలను తొలగిస్తే ప్రజలు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తారని చెప్పారు. ఆర్టికల్‌ 370, 31ఏలను పునరుద్ధరించాలనే డిమాండ్‌ కు తాము కట్టుబడి ఉన్నామని.. వాటిని సాధించేందుకు గట్టిగా పోరాడుతామని చెప్పారు.

Tags

Next Story