జనవరి 1నుంచి ఫాస్ట్ టాగ్ తప్పని సరి

జనవరి 1నుంచి ఫాస్ట్ టాగ్ తప్పని సరి
సంవత్సరం గడువు ఇచ్చినా సరే కొందరు వాహనదారులు ఇప్పటివరకు ఫాస్ట్ టాగ్ చేయించుకోలేదు.

జనవరి1 నుంచి ఫోర్‌ వీలర్ వాహనాలకు ఫాస్ట్ టాగ్ తప్పనిసరి. ఇక నుంచి ఫాస్ట్ టాగ్ లేకుండా టోల్ ఫీజు చెల్లించడం కుదరదు. జనవరి 1వ నుంచి పాస్ట్ టాగ్ తప్పని సరిచేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. అంటే ఇకపై టోల్ ప్లాజా వద్ద డబ్బులు చెల్లించే వ్యవస్థ ఉండదు.

అన్ని టోల్ ప్లాజాల వద్ద పాస్ట్ టాగ్ చేయించుకునేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు. నల్గొండ జిల్లా కేతెపల్లి మండలం కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్‌ విధానంలో టోల్ ఫీజు చెల్లించేందుకు వీలుగా స్టాల్ ను ఏర్పాటుచేశారు. సంవత్సరం గడువు ఇచ్చినా సరే కొందరు వాహనదారులు ఇప్పటివరకు ఫాస్ట్ టాగ్ చేయించుకోలేదు. దీంతో పండుగల సమయంలో ఊర్లకు వెళ్లే వాహనాలతో రోడ్లు కిటకిటలాడుతున్నాయి. ఆ సమయంలో టోల్ ప్లాజా వద్ద ఫీజు చెల్లించేందుకు గంటల సమయం పడుతుంది. కిలోమీటర్ల మేర వాహనాలను నిలిచిపోతున్నాయి.

టోల్ ఫ్లాజా వద్ద ఫీజు చెల్లించే సమయంలో ఇటు వాహనదారులు, అటు పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఫాస్ట్ టాగ్ తీసుకొచ్చింది ప్రభుత్వం. 2017డిసెంబర్ ఒకటవ తేదీ కన్నా ముందు కొనుగోలుచేసిన వాహనాలకు ఈ నిబంధన తప్పని సరిచేసింది. ఫాస్ట్ టాగ్ ఉంటేనే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ జరిగేవి. ట్రాన్స్‌ ఫోర్ట్ వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేయడానికి కూడా ఫాస్ట్ టాగ్ తప్పని సరిచేసింది. ఫాస్ట్ టాగ్ అమలుకు మోటార్ వాహనాల చట్టంలోను మార్పులు చేశారు. థర్డ్ పార్టీ బీమా తీసుకోవాలన్న చెల్లుబాటు ఉన్న ఫాస్ట్ టాగ్ తప్పనిసరి అన్న నింధనను 2021 ఏప్రిల్ ఒకటో తేదీనాటి నుంచి అమలు చేయనున్నారు.


Tags

Read MoreRead Less
Next Story