మొబైల్ కోసం కన్నకూతురిని అమ్మెసిన తండ్రి!

నాన్న.. లోకంలో శుభాలన్నీ తన పిల్లలకే కలగాలనుకుంటాడు. కన్న పిల్లలకు ఏ కష్టం దగ్గరికి రానివ్వకుండా అడ్డుగోడలా ఉంటాడు. నాన్న అంటే కనిపించే ఒక భరోసా. పిల్లలకు కష్టం వస్తుందని ముందుగానే పసిగట్టి వారికి ఏ లోటు రాకుండా చూసుకుంటాడు. అలాంటి తండ్రే పిల్లల పాలిట శాపంలా మారాడు. తన జల్సాల కోసం మూడు నెలల పసి పాపను అమ్మేశాడు ఓ తండ్రి. వచ్చిన డబ్బుతో మొబైల్, బైక్ కొన్నాడు. కర్ణాటకలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన చర్చనీయాంశమైంది.
చిక్కబళ్లాపూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. తన జల్సాల కోసం మూడు నెలల కూతురిని రూ.లక్షకు అమ్మేశాడు. వచ్చిన డబ్బుతో రూ.15వేలు పెట్టి మొబైల్ కొన్నాడు. మరో రూ.50 వేలు పెట్టి బైక్ కొన్నాడు. సడన్‌గా అంత ఖరీదైనా బైక్ కొనడంతో.. అతనికి ఇంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందని గ్రామస్థులకు అనుమానం వచ్చింది. ఆ సమయంలోనే పసి పాప కూడా కనబడడం లేదు. దీంతో ఈ విషయాన్ని గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైనా స్టైల్లో విచారించగా అసలు విషయం బయట పడింది. తల్లిని కూడా విచారించారు పోలీసులు. తనను బెదిరించి బిడ్డను తీసుకెళ్లిపోయాడని తల్లి వాపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com