Kashipur: తండ్రి చివరి కోరిక.. రూ. కోటిన్నర భూమిని మసీదుకు విరాళంగా ఇచ్చిన హిందువులు

Kashipur: తండ్రి చివరి కోరిక.. రూ. కోటిన్నర భూమిని మసీదుకు విరాళంగా ఇచ్చిన హిందువులు
Kashipur: తమ తండ్రి చివరి కోరికను నెరవేర్చిన ఇద్దరు హిందూ సోదరీమణులు ఈద్గాకు రూ. 1.5 కోట్లకు పైగా విలువైన భూమిని విరాళంగా అందించారు.

Kashipur: తమ తండ్రి చివరి కోరికను నెరవేర్చేందుకు ఇద్దరు హిందూ సోదరీమణులు ఈద్గాకు రూ. 1.5 కోట్లకు పైగా విలువైన భూమిని విరాళంగా అందించారు. ఈ సంఘటన ముస్లింలను ఎంతగానో కదిలించింది, దాంతో వారు ఈద్ సందర్భంగా మరణించిన వ్యక్తి కోసం ప్రార్థనలు చేశారు.

కాశీపూర్.. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని ఒక చిన్న పట్టణం. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మతపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న వస్తున్న సమయంలో హిందూ సోదరీమణులు చేసిన పనికి ప్రశంసలు అందుకున్నారు.

20 ఏళ్ల క్రితం మరణించిన బ్రజ్నందన్ ప్రసాద్ రస్తోగి తన దగ్గరి బంధువులకు తన వ్యవసాయ భూమిలోని నాలుగు కుంట్ల భూమిని ఈద్గా విస్తరణ కోసం విరాళంగా ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు. అతను తన చివరి కోరికను తన పిల్లలతో పంచుకునే వయసు కాదు వాళ్లకి.. పిల్లలు ఇంకా చిన్నవారు. దాంతో బంధువులకు తెలియజేశాడు. జనవరి 2003లో రస్తోగి మరణించాడు.

ఢిల్లీ, మీరట్‌లో ఉంటున్న ఆయన ఇద్దరు కూతుళ్లు సరోజ, అనితకు ఇటీవల బంధువుల ద్వారా తండ్రి చివరి కోరిక గురించి తెలిసింది. వారు వెంటనే కాశీపూర్‌లో నివసిస్తున్న వారి సోదరుడు రాకేష్ రస్తోగిని సంప్రదించి అతని సమ్మతిని కోరగా, అతను కూడా వెంటనే అంగీకరించాడు.

"తండ్రి చివరి కోరికను తీర్చడం మా కర్తవ్యం. నా సోదరీమణులు అతని ఆత్మకు శాంతి చేకూర్చే పని చేసారు, "అని రాకేష్ రస్తోగి అన్నారు. "ఇద్దరు సోదరీమణులు మత ఐక్యతకు సజీవ ఉదాహరణ. ఈద్గా కమిటీ హిందూ సోదరీమణులకు కృతజ్ఞతలు తెలియజేసింది. వాళ్లిద్దరినీ త్వరలో సన్మానిస్తామని ఈద్గా కమిటీకి చెందిన హసిన్ ఖాన్ చెప్పారు. మంచి పనికి కులమతాలతో పనిలేదని నిరూపించారు సోదరీమణులు.. నలుగురికీ ఆదర్శంగా నిలిచారు. హిందూ, ముస్లిం ఐక్యతను చాటి చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story